భాగమతి రివ్యూ : ఈ భాగమతి సగమే భయపెడుతుంది.!

భాగమతి తెలుగు రివ్యూ | భాగమతి రివ్యూ | భాగమతి రివ్యూ లో 

Bhaagamathie Review In English

భాగమతి తెలుగు రివ్యూ (3.0/5.0)

కథ : కలెక్టర్ చంచల కార్య దక్షత కలిగిన ఆఫీసర్. పేదల కోసం పని చేసే ఆమె ఒక పని లో భాగంగా శక్తి అనే యువ నాయకుడి తో ప్రేమ లో పడుతుంది.

హోమ్ మినిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ పన్నిన ఉచ్చు లో ఇరుక్కున్న చంచల, దేవుని విగ్రహాల కేసు లో జైలు పాలవుతుంది. ఆ కేసు ని సాల్వ్ చేసేందుకు సిబిఐ ఆఫీసర్ వైష్ణవి బృందం వస్తుంది.

ఈశ్వర్ ప్రసాద్ ప్లాన్ లో భాగంగా , చంచల ను ఒక బంగ్లాలో ఉంచుతారు .అక్కడ జరిగే పరిణామాలేంటి ? భాగమతి ఎవరు ? నిజం గా బాగమతి ఆత్మ ఆ భవనం లో వుందా ? చంచలకు,ఆ ఆత్మ కు సంబంధం ఏంటి అనేది తెర మీద చూడాల్సిందే !

విశ్లేషణ : ఈ కథ కైనా బలం చక్కని కథనం,దాని తెరకెక్కించే తీరు ! భాగమతి ఆ విషయం లో కొంత వరకు సఫలమైంది . మెల్ల గా అన్ని తెలుగు సినిమాల్లోని కథ ల్లానే ప్రేమ కథ, ఉద్యోగం బాధ్యతలతో మొదలైన భాగమతి , ఇంటర్వెల్ లో భయపడతుంది. కొన్ని మంచి ట్విస్ట్స్ ,అనుష్క నటన ,తమన్ నేపధ్య సంగీతం ఆ యా సీన్స్ కి ప్రాణం పోశాయి.

రెండో భాగం లో బోల్డెన్ని మలుపులు, భయం గొలిపించే సన్నివేశాలు, భాగమతి భవనం,ఆశ్చర్య కరమైన సన్నివేశాలు కట్టి పడేస్తాయి. క్లైమాక్స్ కొన్ని వర్గాలకి రుచించకపోవచ్చేమో కానీ., భాగమతి మాత్రం ఒక మంచి ప్రయత్నమే చేసింది .

అనుష్క అందం,నటన తో మరో సారి భాగమతి పాత్రకు ప్రాణం పోసింది. తనను తప్ప వేరెవర్నీ ఆ పాత్ర లో ఊహించుకోలేము .

జయరాం,ఉన్ని ముకుందన్ తమ పాత్రలకు న్యాయం చేసారు. మలయాళ నటి ఆశా శరత్ ,మురళి శర్మ పర్వాలేదు . ధన్ రాజ్ ,విద్యుల్లేఖ,ప్రభాస్ శ్రీను కి ఎక్కువ కామెడీ సీన్స్ రాయలేదు. ఉన్నంతలో వాళ్ళు కూడా పర్వాలేదనిపించారు.

యూవీ క్రియేషన్స్ వారి నిర్మాణ విలువలు బావున్నాయి. భాగమతి బంగ్లా ఆర్ట్ వర్క్ బావుంది . తమన్ సంగీతం చాలా బావుంది. చాలా సన్నివేశాల్ని అతని నేపధ్య సంగీతమే నిలబెట్టింది .

డైరెక్టర్ జి అశోక్ మలుపులు,భయం కలిగించడం అనే దాని మీదే ఎక్కువ ఏకాగ్రత చూపించాడు . కామెడీ,ఎమోషన్ ని సరి అయిన పాళ్లల్లో కలపడం లో మాత్రం ఫెయిల్ అయ్యాడు . ప్రథమార్ధం లో కొన్ని సీన్స్ చాల సాదా సీదా గ నడుస్తాయి. ద్వితీయార్ధం లో ఎక్కువ మలుపులు వున్నాయి కాని, అవి ఎంత వరకు సక్సెస్ అవుతాయి అనేది కొన్ని షోస్ అయ్యాకే తెలుస్తుంది.

చివరి మాట : మొత్తానికి భాగమతి మెప్పిస్తుంది భయపెడుతూ , కథ చెప్తూ, అరుస్తూ ..! సాంకేతిక విలువల కోసం,అనుష్క నటన కోసం చూడొచ్చు . మంచి థియేటర్ లో చూస్తె ఖచ్చితం గా ఒక మంచి అనుభూతి ని కలిగించే సినిమా ఇది.

ఒక్క మాట లో : ఈ భాగమతి సగమే భయపెడుతుంది.!

Bhaagamathie Review In English

 

Advertisement