భైరవగీత మూవీ రివ్యూ:మితిమీరిన వయొలెన్స్

Bhairava Geetha Review

Bhairava Geetha Review and Rating : 2.5/5.0

విడుదల తేదీ : డిసెంబర్ 14, 2018

నటీనటులు : ధనుజయ్, ఇర్ర మోర్,రాజా బల్వాడి

దర్శకత్వం : సిద్ధార్థ

నిర్మాత : అభిషేక్ నామా, భాస్కర్ రసీ

సంగీతం : రవి శంకర్

సినిమాటోగ్రఫర్ : జగదీష్ చీకేతి

ఎడిటర్ : అన్వర్ అలీ

ట్రైలర్:ప్రేమలో పడితే లేవలేరంటున్న శర్వా!

రామ్ గోపాల్ వర్మ సినిమా వస్తుందంటే ఒకప్పుడు సినీ ప్రేమికులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూసేవారు.ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.దీంతో వర్మ దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చి నిర్మాతగా బాధ్యతలు స్వీకరించారు.కొత్త దర్శకుడు సిద్దార్ధ్ తెరకెక్కించిన పిరియాడిక్‌ ఫ్యాక్షన్‌ డ్రామా భైరవ గీత.,ధనుంజయ, ఇర్రామోర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేశారు.

కథ:

రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది.తక్కువ కులంలో పుట్టిన భైరవ (ధనుంజయ) పెద్ద ఫ్యాక్షనిస్ట్‌ అయినా సుబ్బారెడ్డి దగ్గర పనిచేస్తుంటాడు.సుబ్బారెడ్డి కూతురు గీత(ఇర్రా మోర్‌),ఆమెకు తన స్థాయికి తగ్గట్టుగా కట్టారెడ్డి అనే మరో ఫ్యాక్షనిస్ట్‌కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు .ఈ లోపు గీత భైరవ ప్రేమలో పడిపోతుంది.వీళ్ళ ప్రేమను సుబ్బారెడ్డి అంగీకరించడని ఇద్దరు ఊరు వదిలి పారిపోతారు.ఈ విషయం తెలుసుకున్న సుబ్బారెడ్డి-కట్టారెడ్డి భైరవ తల్లిని, స్నేహితులను చంపేస్తారు. దీంతో భైరవ, సుబ్బారెడ్డి మీద తిరుగుబాటు చేస్తాడు.ఈ తిరుగుబాటులో ఎవరు గెలిచారు?చివరికి గీత-భైరవ ఒక్కటయ్యారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

భైరవగీత నటీనటుల ఎంపికలో వర్మ మార్కు కనిపిస్తుందనే చెప్పాలి.హీరో ధనుంజయ్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు.సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగటంతో పెద్దగా వేరియేషన్స్‌ చూపించే అవకాశం లేకపోయినా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ధనుంజయ నటన ఆకట్టుకుంటుంది.హీరోయిన్ ఐరా మోర్ కొత్త నటిలా కాకుండా అనుభవం కలిగిన నటిలా పాత్రలో ఒదిగిపోయింది.ఆమె నటనతో పాటు,గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది.ఇక సుబ్బారెడ్డి ,కట్టారెడ్డి రాయలసీమ కసాయితనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు.

తీర్పు:

సినిమా ప్రారంభంలోనే వర్మ కథ మొత్తం చెప్పినా, ఒక్కొక్క పాత్రలను పరిచయం చేస్తూ దర్శకుడు సినిమాను ముందుకు తీసుకెళ్తాడు.ఈ ఒరవడి కొంచెం కొత్తగా ఉందని చెప్పొచ్చు.సినిమా స్టోరీ తెలిశాక చివరి వరకు ప్రేక్షకులని థియేటర్లలో కోర్చోబెట్టాలంటే కత్తి మీద సాము లాంటిదే.ఈ విషయంలో దర్శకుడు సఫలమయ్యాడనే చెప్పొచ్చు.అయితే వయలెన్స్‌ మీద పెట్టిన దృష్టి, ఇతర సన్నివేశాల మీద పెట్టినట్టుగా అనిపించదు.ముఖ్యంగా లవ్‌ స్టోరి ఏమాత్రం కన్వింన్సింగ్‌గా లేదు.అలాగే కొన్ని సన్నివేశాలు రక్తపాతంతో చూడటానికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.సినిమాలో కొంచెం ఎమోషన్స్ కూడా ఉంటే బాగుండేది.సినిమా అంతా వయలెన్స్‌ మీదే దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది.సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాకు తగ్గట్టుగా తన ఫ్రేమ్స్‌లో చూపించాడు కెమెరామేన్‌. సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.