మతి పోగొడుతున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

Image result for bheeshma telugu movie glimpse

 
‘నా లవ్‌ కూడా విజయమాల్యా లాంటిదిరా.. కనిపిస్తుంటుంది కానీ క్యాచ్‌ చేయలేం’అంటూ నితిన్‌ రష్మిక గురించి చెప్పే డైలాగ్‌ అభిమానులను బాగా ఎంజాయ్ చేస్తున్నారు . ఖుషీ నడుము సీన్‌ ఎంత హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్‌ వీరాభిమాని అయిన నితిన్‌ ఇప్పటికే ఆ ఫార్ములాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’సినిమాలో వినియోగించుకున్నాడు. ఇక మరోసారి సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసి అభిమానుల మనసులను దోచే ప్రయత్నం చేసింది ‘భీష్మ’ . ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ యూత్‌ను తెగ ఆకట్టుకుంటోంది. రిలీజ్‌ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఒక మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకోవడంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కుర్రకారును ఒక ఊపు ఊపిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ బర్త్‌డే సందర్బంగా ‘భీష్మ’చిత్ర యూనిట్‌ అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ పేరుతో చిన్న టీజర్‌ రిలీజ్‌ అయింది. హీరోహీరోయిన్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయో ఫస్ట్‌ గింప్ల్‌లో చూపించే ప్రయత్నం చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది.