జ్యోతక్క దెబ్బకి విల విల లాడుతున్న ఏడు చేపలు

అసలు మజా అంత 13 వ వారం లో మొదలు అయ్యింది .నువ్వా నేనా అన్నట్లు సాగిన నామినేషన్ ప్రక్రియ లో అందరును నామినేట్ అయినట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.
 
Bigg boss 3 Telugu 13th week nomination

13 వ వారం నామినేషన్ లో భాగం గా “టాపర్ ఆఫ్ ది హౌస్ ” అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
మొదటగా హౌస్ లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్ కు ఏడూ స్థానాలను ప్రకటించాడు,తాను సూచించిన స్థానాలు కరెక్టో కాదో ,ఎందుకు కాదో వివరణ ఇవ్వవలసి ఉంటుంది ,దానిని బట్టి తాను ఏ స్థానానికి సరిపోతానో నిర్ణయించుకొని ఆ స్థానం లో వున్నా కంటెస్టెంట్ ని ఒప్పించవలసి ఉంటుంది,తన వివరణ కి కంటెస్టెంట్ అంగీకరిస్తే తన స్థానాన్ని మార్చుకోవచ్చు.

కొన్ని వాడి వేడి చర్చల తర్వాత 3 వ ప్లేస్ మినహా అన్ని స్థానాలలో కంటెస్టెంట్స్ నిలబడగా వితిక మరియు శివజ్యోతి నేనే నెంబర్ త్రీ అంటే కాదు నేనే నెంబర్ త్రీ అని ,నెంబర్ వన్ ని వదిలేసి నెంబర్ త్రీ కోసం కొట్టుకునే అంత పని చేసి చివరికి అందరిని నామినేషన్స్ లో కి తీసుకోని వెళ్లారు .ఇప్పటివరకు ప్రేక్షకులు తన అభిమాన కంటెస్టెంట్ నామినేషన్ లో లేకపోతే వేరే వారికీ సపోర్ట్ చేసి హౌస్ లో ఉండే విధం గా చేశారు ,కానీ ఇప్పుడు
తమ కంటెస్టెంట్ ని కాపాడుకునే పని లో పడ్డారు .చివరగా కంటెస్టెంట్ కి కాదు నామినేషన్ ,అభిమానులకి అన్నట్లు అయ్యింది.ఇప్పుడు తెలుస్తుంది ఎవరికి ఎంత మంది అభిమానులు ఉన్నారో ????