బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 టైటిల్‌ విన్నర్ రాహుల్

 

bigg boss3 title winner rahul
bigg boss3 title winner rahul

 

3 నెలల క్రితం ప్రారంభమై అనేక వివాదాలతో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్‌–3 షో విజేతగా గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచారు. దీంతో ఆయన రూ.50 లక్షల నగదు బహుమతిని దక్కించుకున్నారు. అండర్‌డాగ్‌గా బిగ్‌హౌస్‌లోకి ఎంటర్‌ అయిన రాక్‌స్టార్ రాహుల్‌ .. విన్నర్‌గా బిగ్‌బాస్‌ ట్రోఫిని రాహుల్‌ అందుకున్నాడు.. దీంతో టైటిల్ ఫెవెరెట్‌గా హౌస్‌లో సందడిచేసిన శ్రీముఖి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతిని, బిగ్‌బాస్‌ ట్రోఫిని రాహుల్‌ అందుకున్నాడు.ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. తనకు ఓట్లు వేసి గెలిపించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు చేశారు. ఈ విజయం తనను పది మెట్లు పైకి ఎక్కించాయని, ఇక నుంచి తన లైఫ్‌ కొత్తగా ఉండబోతుందని చెప్పారు. తన గెలుపు కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రేక్షకులు ఎంతో సహకరించారని రాహుల్‌ అన్నారు. తన విజయంలో పునర్నవి, వరుణ్‌, వితికల కష్టం కూడా ఉందన్నారు.

పునర్నవి గురించి మాట్లాడుతూ.. ‘ఫస్ట్ నేను టాస్కులు ఆడకపోతుండే. పెద్ద లేజీగాడు లెక్కుండే. మంచిగజెప్పింది ఇన్లేదు. టాస్కులు ఆడరా అని జెప్పింది. అయినా ఇన్లేదు. అరె ఎదవ ఆడరా టాస్కులు అని జెప్పింది. అయినా ఇన్లేదు. ఒకరోజు ఫాట్ అని బైరిబెట్టింది. అయినా ఇన్లేదు. ఆఖరికి నామినేట్ జేసింది. తీస్కపోయి ముఖానికి రంగు పూసింది’ అని చెప్పాడు. టాస్క్‌ల వల్లే శ్రీముఖికి, తనకు బేదాభిప్రాయాలు వచ్చాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి లేదన్నారు. ఇక నుంచి తన లైఫ్‌ కొత్తగా మారుతుందని చెప్పారు. ‘ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో మా అమ్మనాన్న కడుపులో పుట్టాను’అంటూ రాహుల్‌ ఎమోషనల్‌ అయ్యాడు.