బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ:ఆసక్తికర కథనం

Bluff Master Telugu Movie Review

బ్లఫ్ మాస్టర్ మూవీ రివ్యూ రేటింగ్: 3.0/5.0

విడుదల తేదీ : డిసెంబర్ 28, 2018

నటీనటులు : సత్యదేవ్, నందిత శ్వేత్ తదితరులు.

దర్శకత్వం : గోపీ గణేష్ పట్టాభి

నిర్మాత : రమేష్, పి.పిళ్ళై

సంగీతం : సునీల్ కశ్యప్

సినిమాటోగ్రఫర్ : దాశరధి శివేంద్ర

ఎడిటర్ : నవీన్ నూలి

కేజీఎఫ్ మూవీ రివ్యూ:అంచనాలకు మధ్యలో

సత్య దేవ్,నందితా శ్వేత కలయికలో ఈ సినిమాని గోపీ గణేష్ పట్టాభి తెరకెక్కించారు.సపోర్టింగ్‌ రోల్స్‌ తో వెండితెరకు పరిచయం అయిన సత్యదేవ్‌ ఇప్పటికే తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకున్నాడు.సినిమా ప్రమోషన్స్ నుండి కథనమే మా సినిమాకు బలమని చిత్రబృందం చెప్పుకుంటూ వస్తున్నారు.వారు చెప్పినట్టుగా సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందో లేదో చూద్దామా?.

కథ :

ఏడేళ్ల వయస్సులో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) కు,సమాజంలో బతకాలంటే డబ్బు తప్పనిసరి అని తెలుసుకుంటాడు.దాంతో మారువేశాలు వేస్తూ,అందరిని మోసం చేస్తూ,డబ్బును బాగా సంపాదిస్తాడు.డబ్బులతో పోలీసులను ,లాయర్లను కొనేసి సాక్ష్యాలను తారుమారు చేస్తుంటాడు.ఇలాగే తన వద్ద ఉద్యోగంలో చేరిన అవనిని (నందితా శ్వేత) ప్రేమిస్తున్నట్టు మోసం చేస్తాడు.ఒకరోజు ఉత్తమ్ చేతిలో మోసపోయిన కొంతమంది ఆయనను కిడ్నాప్ చేస్తారు.తాను సంపాదించిన డబ్బు మొత్తం ఇస్తేనే ప్రాణాలతో విడిచి పెడతామని బెదిరిస్తారు.వేరే దారి లేక ఉత్తమ్ డబ్బు ఇవ్వడానికి సిద్ధపడతాడు.ఈ క్రమంలో డబ్బు తీసుకు రమ్మని ఉత్తమ్ తన స్నేహితులకు చెప్తాడు.డబ్బు మీద ఆశతో స్నేహితులు ఉత్తమ్ ని మోసం చేస్తారు.ఇక ఉత్తమ్ రౌడీల నుండి తప్పించుకుంటాడా?మంచి వాడిలా మారతాడా? అవనిని మళ్లీ కలుస్తాడా? అన్నదే మిగతా కథ.

నటీనటులు :

హీరో సత్యదేవ్ తన నటనతో సినిమాకి హైప్ తీసుకొచ్చాడు.సహజమైన నటనతో అటు మోసగాడిలా,మంచివాడిలా వైవిధ్యంగా నటించాడు.డబ్బు కంటే ప్రేమకే వాల్యు ఇచ్చే అమ్మాయిలా నందితా శ్వేత తన పాత్రలో జీవించింది.ధనశెట్టి అనే కామిక్ పాత్రలో నటించిన పృథ్వి తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు.ఇతర పాత్రలలో నటించిన ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

తీర్పు :

తమిళ సినిమా ‘శతురంగవేట్టైని’ తెలుగులో రీమేక్‌ చేసి,తెలుగు అభిమానుల పరిధికి తగ్గట్టుగా తీర్చిదిద్దటంలో దర్శకుడు గోపీ గణేష్ విజయం సాధించాడు. అసలు కథలో పెద్దగా మార్పులు చేయకపోయినా, కథను నడిపించే విధానంలో తన మార్క్‌ ను చూపించాడు. ముఖ్యంగా పాటలు, ఫైట్లు మధ్యలో పెట్టకుండా సినిమాను నడిపించిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది.అక్కడక్కడా కొంచెం నెమ్మదిగా అనిపించినా ప్రేక్షకులని ఆకట్టుకుంది.సినిమాకు మరో బలం డైలాగ్స్ అని చెప్పొచ్చు.కథాకథానాయకుల మధ్య ప్రేమ కథను కొంచెం ఆసక్తికరంగా చూపించుంటే బాగుండేది.అలాగే కొన్ని సన్నివేశాలలో ఆసక్తి సన్నగిల్లింది.సునీల్‌ కాశ్యప్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.