రాజమౌళికి చుక్కలు చూపిస్తున్న బాలీవుడ్ భామలు!

Bollywood Actresses Demandsరాజమౌళి దర్శకుడిగా ఎన్టీఆర్,రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం’#RRR’. తెలుస్తున్న సమాచారం మేరకు ‘#RRR’ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ లో ఉన్న గొప్పతనం అదేనంటున్న..

ఈ ముగ్గురిలో ఖచ్చితంగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నాడట. ఇప్పుడు ఆ ఉద్దేశ్యమే రాజమౌళికి ఊహించని టెన్షన్ గా మారిందని అంటున్నారు.

‘#RRR’ కోసం ఆలియా భట్ – ప్రణితి చోప్రాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ పెడుతున్న కండిషన్స్ మాత్రం ఏకంగా జక్కన్న మైండ్ బ్లాంక్ చేస్తున్నాయట.

అంతేకాదు అలియా భట్ 6 కోట్ల పారితోషికం అడిగితే, ప్రణితి చోప్రా 4 కోట్లు పారితోషికం అడగడమే కాకుండా, వారి సహాయకుల కోసం కూడ భారీ ప్యాకేజీలు అడుగుతున్నట్లు సమాచారం.

దీంతో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాను తీసిన రాజమౌళికి కూడ, హీరోయిన్ కష్టాలు తప్పడం లేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement