‘ఆర్ ఆర్ ఆర్’ కోసం బాలీవుడ్ స్టార్స్

 దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’.
ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్రను పోషిస్తున్నారు.

#RRR ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో అజయ్ దేవగణ్

ఇప్పటికే బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్న సంగతి తెలిసిందే. 
ఇటీవల ఈ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నదని వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారట.

ఈ చిత్రంలోని కీలక పాత్రలకు వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌ను దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక ఈ చిత్రం కోసం వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం . 2020 జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.