మోదీతో బాలీవుడ్ స్టార్స్ సెల్ఫీ పోజ్

రణ్‌వీర్ సింగ్, రణబీర్‌ కపూర్‌, ఆయుష్మాన్ ఖురానా, వరుణ్ ధావన్‌ వంటి తదితర నటులు ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి గురువారం దిల్లీకి వెళ్లారు.

బన్నీ పై బాలీవుడ్ బాద్ షా ప్రశంసలు

ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం వీరు మోడీ ని కలిసినట్లుగా తెలుస్తుంది.
దానిలో భాగంగా బాలీవుడ్ యువ నటులతో ప్రధాని నరేంద్ర మోదీసెల్ఫీకి పోజిచ్చారు.

ఇప్పుడు ఆ సెల్ఫీ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.కరణ్ జోహార్ మోడీ తో దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసి..’ఈరోజు మోడీ ని కలిసినందుకు చాలా ఆనందంగా వుంది.భారతదేశానికి ఫిలిం ఇండస్ట్రీ తరపున ఏం చేయగలమో చర్చించాం,అంతేకాకుండా , మన దేశానికి ఎంతో చేయాల్సి ఉంది. భారత దేశంలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావాలని మేమందరం కోరుకుకుంటున్నాం.’ అని పోస్ట్ చేశారు. 

ఈ కార్యక్రమంలో అలియా భట్, భూమి ఫడ్నేకర్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, ఏక్తా కపూర్‌, రాజ్‌కుమార్ రావ్‌, విక్కీ కౌశల్‌, అశ్విని అయ్యర్‌ వంటి పలు యువ తారలు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా గత సంవత్సరం డిసెంబరులో అక్షయ్ కుమార్, కరణ్‌ జోహార్, అజయ్‌ దేవగణ్, సిద్ధార్థ్‌ రాయ్ కపూర్‌, తదితర 18 మంది సభ్యులు మోదీతో సమావేశమయ్యారు. వినోద రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement