చంద్రబాబుకు భీకర సవాల్:బొత్స

Botsa on Chandrababu

వైసీపీ కీలక నేత , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబుకు కాస్త గట్టిగానే సవాల్ విసిరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పిన చంద్రబాబు, ఓ మూడు సార్లను మినహాయిస్తే, మిగిలిన 26 సార్లు మోదీకి అసలు లేఖలు ఇచ్చారా? అని ప్రశ్నించారు.

బాబు ఢిల్లీ వెళ్లి చేసే పని ఇదేనట!

ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకి ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకుంటే, అంతదూరం వెళ్లిన సీఎం కనీసం తాను ఎందుకోసం వచ్చానన్న విషయాన్ని అయినా, పీఎంకు తెలియజేసేందుకు ఓ లేఖ అయినా ఇచ్చి రావాల్సిందే కదా.

నిజానికి ఒక్క చంద్రబాబే కాకుండా ఏ ఒక్కరైనా ఈ దిశగా ఢిల్లీకో – ఇంకెక్కడికో వెళ్లినా,తమ విజ్ఞాపనను తెలుపుతూ తాను కలవాలనుకుంటున్న నేత కార్యాలయంలో లేఖ అయితే ఇచ్చి రావాల్సిందే కదా.దమ్ముంటే తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని బొత్స చంద్రబాబును నిలదీశాడు.

మరి చంద్రబాబు లేఖలు ఇచ్చారా? ఇచ్చి ఉంటే బొత్స సవాల్ కు స్పందించాల్సిందే కదా.మరి ఎందుకు బాబు స్పందించలేదు.అంటే చంద్రబాబు తన సొంత ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాడని తెలుస్తుంది.

Advertisement