‘సైరా’ లో స్టైలిష్ స్టార్ ?

మెగాస్టార్ చిరంజీవి,సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెల్లదొరలపై పోరాటం చేసిన నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’.

ఫాదర్ సెంటిమెంట్ తో రానున్న త్రివిక్రమ్ ?

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా నయనతారనటిస్తుండగా , తమన్నా , బిగ్ బి అమితాబ్ , జగపతి బాబు , సుదీప్, విజయ్ సేతుపతి పలు క్యారెక్టర్స్ లలో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక తాజా వార్త ఇపుడు వైరల్ గా మారింది.ఈ మూవీ లో మరో మెగా హీరో ను నటింపచేయాలనీ భావిస్తున్నారట చిత్ర యూనిట్.

మెగా ఫ్యామిలీలో చాలామందే హీరోలు ఉన్నప్పటికీ వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అల్లు అర్జున్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారంట చిత్ర బృందం.

అయితే ఈ విషయం మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 

Advertisement