నేడు వైసీపీలో చేరిన ముఖ్య నేతలు!

Candidates Joined in YSRCPహైదరాబాద్‌ లో కిటకిటలాడుతున్న ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది జగన్ నివాసమైన లోటస్ పాండ్ అని చెప్పొచ్చు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీల నేతలు వైసీపీలో చేరుతున్నారు.

టీడీపీ ఓటు బ్యాంకు మరీ తగ్గనుందా?

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వర ప్రసాద్ పీవీపీ చేరారు. ఆయనతో పాటు నటుడు రాజారవీంద్ర కూడా చేరారు.ఇంకా టీడీపీ ఎంపీ తోట నరసింహులు,ఆయన కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

అలాగే విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు,ఆమె అనుచరులతో వైసీపీలో చేరారు.ఈ రత్నబిందు ఎవరో కాదు అల్లు అరవింద్ బావమరిది భార్య, అంటే చిరంజీవి కుటుంబ సభ్యురాలు.

ఇంకా ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, తన భర్త ఎస్‌.ఎం.ఆర్ పెద్ద బాబు వైసీపీలో చేరనున్నారు.ఇలా వైసీపీలో చేరబోతున్న నేతలతో హైదరాబాద్‌లోని జగన్ నివాసం ఫుల్ బిజీగా ఉంటోంది.

Advertisement