కాలిఫ్లవర్ మంచూరియా

సాయంత్రం సమయాల్లో తినే స్నాక్స్‌గా ఈ కాలీఫ్లవర్ మంచూరియా చక్కగా నప్పుతుంది .ఈ మంచూరియా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు .
కాలిఫ్లవర్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

Cauliflower Manchuriya

కావలసిన పదార్థాలు;

కాలీ ఫ్లవర్ – 1/2 కిలో,
మైదా – 2 టీ స్పూన్లు
కార్న్‌ ఫ్లోర్‌ – 1 1/2 కప్పులు,
కారం – 1 టీ స్పూను
ఉప్పు – 1 టీ స్పూను,
మిరియాల పొడి – 1 టీ స్పూను
నీళ్లు – 1 1/2 కప్పు
వెల్లుల్లి – 4 (సన్నగా తరగాలి),
అల్లం – చిన్న ముక్క,
టమాటా సాస్‌ – 3 టీ స్పూన్లు,
చిల్లీ సాస్‌ – 1 టీ స్పూను
సోయా సాస్‌ – 3 టీ స్పూన్లు,
అజినమొటో – 1 టీ స్పూను
నూనె – తగినంత
స్ప్రింగ్ ఆనియన్స్ – 1/4 కప్పు

తయారీ విధానం;

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా , కార్న్‌ ఫ్లోర్‌, మిరియాల పొడి ,ఉప్పు మరియు కారం వేసుకొని అన్నీ ఒకసారి కలిపి , 1 1/2 కప్పుల నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
ఈ పిండిలో కాలీ ఫ్లవర్ ముక్కలను ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి.తరువాత
బాండీలో కొంచెం నూనె పోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
తర్వాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి.
అనంతరం ముందుగా వేయించి పెట్టుకున్న కాలీ ఫ్లవర్ ముక్కలను వేసి 2 ని.లు వేయించుకొని తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ తో అలంకరించి సర్వ్‌ చేయాలి, ఎంతో రుచికరమైన కాలీ ఫ్లవర్ మంచూరియా రెడీ.