‘యాత్ర’ సెన్సార్ రిపోర్ట్

దివంగత మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర’. వి.రాఘవ్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

అడవి దొంగగా ఎన్టీఆర్ …?

సెన్సార్ ఈ చిత్రానికి ‘U’సర్టిఫికెట్ ఇచ్చింది.ఇక ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించగా పోసాని కృష్ణ మురళి, రావు రమేష్,సుహాసిని, వంటి నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి తనయుడి పాత్రలో స్వయంగా వైఎస్ జగన్ తొలిసారి తెర పై కనిపించబోతున్నారని సమాచారం.

70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement