టీడీపీని వీడనున్న చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి!

Challa Rama Krishna Reddy Leaves TDPఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆయన పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఆగడమే లేదు.తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.

కడపలో టీడీపీకి గుండు సున్నా..

ఈ జాబితాలోకి మరో టీడీపీ నేత చేరనున్నారా అంటే అవుననే చెప్పాలి.క‌ర్నూలు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నేత చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి త్వ‌ర‌లో టీడీపీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని విశ్వసనీయ సమాచారం.

ఎందుకంటే గ‌తంలో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చి హ్యాండ్ ఇచ్చారట.తాజాగా చంద్రబాబు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌ గా వర్ల రామయ్యను, రీజియన్ ఎండీగా త‌న‌ను నియమించ‌డంతో చ‌ల్లాకు మండేలా చేశాయట.

నిజానికి చల్లా మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.ఆ సమయం రానే వచ్చింది.ఈ వంకతో ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.అలాగే ఆయన బ‌న‌గాంప‌ల్లి టిక్కెట్ ఆశిస్తున్నారట.చూడాలి మరి జగన్ ఆయనకు టిక్కెట్ ఇస్తారో లేదో.

Advertisement