ప్రచారానికి నేతలు కావాలి:చంద్రబాబు

Chandrababu annoncementఉదయం లేచిన దగ్గర్నుంచీ భజంత్రీలు వాయించుకునే చంద్రబాబు, రాష్ట్రంలో ప్రచారం చేయడానికి మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి నేతలను దిగుమతి చేసుకుంటున్నారు.

ప్రచారాలలో లోకేష్ కు చుక్కెదురు!

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి ఇప్పటివరకూ పలు ప్రచార సభలు నిర్వహించారు. వాటికి జనం సరిగా రావడం లేదు. ఆ వచ్చిన కొద్దిపాటి జనం నుంచీ ఆయన ప్రసంగాలకు స్పందన కనిపించడం లేదు. పైగా ఆయన చేపట్టిన అభివృద్ధి పనులేంటో చెప్పకుండా ఎంతసేపూ ఇతరులను విమర్శిస్తూనే ప్రచారం సాగిస్తూ వచ్చారు.

ఇక లోకేష్‌ ఎన్నికల ప్రచారానికి వెళుతూంటే చంద్రబాబే బెంబేలెత్తుతున్నారు. ఏం మాట్లాడితే ఎలాంటి నష్టం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్‌ తప్పుల తడక ప్రసంగాలు, తడబాట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతుండటంతో వీలైనంత వరకూ లోకేష్‌తో ప్రచార కార్యక్రమాలు తగ్గించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

చివరి నిమిషంలో పప్పులో కాలేస్తే అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పైగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లోకేష్‌ను ప్రచారానికి రావాలని కోరుకుంటున్న నేతలే లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.