చంద్రబాబుకి భయం ఇందుకేనట!

Chandrababu Fear about Electionsఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక మూడున్నర నెలల సమయం మాత్రమే ఉంది.దీంతో వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇచ్చాపురం వేదికగా ప్రజాసంకల్ప యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు.ఆ తరువాత ఎన్నికల కార్యాచరణపై ద్రుష్టి సారించారు.ఇప్పటికే ఆయా నియోజక వర్గాల నుండి అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు.

జగన్ ముందు బాబు ఎప్పుడో ఓడిపోయాడు:గట్టు

ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం వెంపర్లాడుతూ,ఎన్నికల కార్యాచరణపై పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు.ఈ క్రమంలో బాబుకు ఒక భయం పట్టుకుందట.ఎన్నికలకు చాలా ముందుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ,అసంతృప్తులంతా వైసీపీ గూటికి చేరుతారేమోనని,అలా తన గోతిని తనే తవ్వుకున్నట్టు అవుతుందని బాబు ఆలోచనలో పడ్డాడట.

జగన్ తన అభ్యర్థులను ప్రకటించేదాకా వేచి చూడాలని బాబు దాదాపుగా నిర్ణయించేసుకున్నారట. జగన్ ముందుగా తన పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తే, అక్కడ అసంతృప్తితో రగిలిపోయే నేతలంతా వచ్చి తన పార్టీలో చేరతారని, ఇది తనకు కలిసివచ్చే అంశమేనని బాబు వ్యూహమట.

కానీ జగన్ మాత్రం ఎలాంటి భయాలకు తావివ్వకుండా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ పోతున్నారు.ఈ విషయంపై జగన్ కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

 

Advertisement