బాబుకు అర్థమయిపోయిందా?

Chandrababu Mind Gameఎన్నికలు దగ్గర పడుతుండంతో జగన్ కి ఓటు వేయవద్దు అంటూ,గత కొన్ని రోజులుగా చంద్రబాబు పదే పదే చెబుతున్నాడు.జగన్ని గెలిపించుకుంటే అరాచకమే అని కూడా జనాన్ని భయపెడుతున్నారు.

వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అప్పుడేనట!

నిజానికి ఇదంతా చంద్రబాబు ఎందుకు అంటున్నారు.ఆయన ప్రతీ నిమిషానికి అనేక సర్వేలను దగ్గర పెట్టుకుంటారు. ఎక్కడ ఏం జరుగుతుందన్నది బాబుకు క్షణాల్లో తెలిసిపోతోంది.

నిన్నటివరకూ టీడీపీకి ఎదురుండదని చెప్పిన బాబు, ఇపుడు ఇలా జగన్ కి ఓటు వేయవద్దు అంటూ వేడుకుంటున్నారంటే,ఆయనకు ఓటమి తప్పదని అర్థమైపోయిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

బాబు అలా మాట్లాడటానికి అసలు కారణం ఇదేనట. ఏపీలో వైసీపీ వైపుగా వలసలు జోరందుకోవడం. ఇప్పటివరకూ చేసిన సర్వేలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగానే వస్తుండటం.ఇక ఈ పరిణామాలకు తోడు ముందుగా ఎన్నికల షెడ్యూల్ రావడం .దీంతో అందరు రానున్న ఎన్నికలలో జగన్ కి కలసి వస్తుందని అనుకోవడం.