బాబుతో పొత్తుకు పవన్ నో.. నమ్మొచ్చా?

Chandrababu Pawan Allianceఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే బాబుకు ఓటమి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే బాబు ఇచ్చిన హామీలను ఎటూ నెరవేర్చడు ,అంతకు మించి టీడీపీ పాలనలో అవినీతి భారీ ఎత్తున జరుగుతుంది,వీటన్నిటిని కప్పిపుచ్చుకొని గెలవాలంటే ఒక్కడి తరం కాదు.దీంతో పొత్తుల కోసం వెంపర్లాడుతుంటాడు.

చంద్రబాబు పైశాచికం చూశారా?

గడచిన రెండు రోజులుగా బాబు పవన్ కల్యాణ్ – జనసేనలకు అనుకూలంగా ప్రకటనలు గుప్పిస్తున్నాడు.ఆ తంతును నిన్న కూడా కొనసాగించారు. అయితే తనతో పొత్తుకు టీడీపీ యత్నిస్తున్న వైనాన్ని పవన్ పసిగట్టాడు.

పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో జనసేన వామపక్షాలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటుందని, ఇక ఏ ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోదని, ఏపీలో అధికార – విపక్షాలతో అసలే పొత్తు ఉండదని చాలా స్పష్టంగా చెప్పేశారు.

పవన్ అయితే నో చెప్పాడు ,కానీ బాబు మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాడు,ఎందుకంటే అవసరానికి కాళ్ళైనా పట్టుకొనే రకం బాబు గారు.చూద్దాం పవన్ కళ్యాణ్ తన మాట మీద ఏమాత్రం నిలబడతాడో లేదా జగన్ వంకతో టీడీపీతో జత కడతాడో!.

Advertisement