షాక్ లో చంద్రబాబు.,కారణం అతనే!

Mulayam Singh Yadav Commentsఢిల్లీలో చంద్రబాబు చేసిన ధర్మ పోరాట దీక్షకు జాతీయ నేతలంతా వచ్చి సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా సమాజ్ వాద్ పార్టీ అగ్రనేత ములాయం సింగ్ యాదవ్,రాహుల్ గాంధీ వచ్చి చంద్రబాబు దీక్షకు మద్దతు తెలిపారు.

‘అన్న వస్తున్నాడు’ అంటూ జనంలోకి జగన్!

అంతేకాదు వీరంతా వేదికపై ప్రసంగించారు కూడా.మోదీకి వ్యతిరేఖంగా ,చంద్రబాబుకు మద్దతుగా ప్రసంగించారు.అలాగే బాబు కూడా వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకున్నారు.

ఇంతలో ఏమైందో ఏమో ,ఈ ఘటన జరిగిన రెండు రోజులు కూడా పూర్తి కాకముందే ములాయం సింగ్ ప్లేటు ఫిరాయించేశారు.ఆయన ప్రధాని మోదీని ప్రశంసించడం మొదలుపెట్టారు.

మోదీ అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారని, ఆయన పాలన బాగుందని,ఆయనను ఎవరు వేలెత్తి చూపలేరని,మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని ములాయం సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిందట.