అసహనంలో బాబు., మరీ ఇంతలానా?

Chandrababu Speechవిజయనగరం జిల్లాలోని సాలూరు, చీపురుపల్లి, విజయనగరం రోడ్ షోలలో బాబు చేసిన ప్రసంగాలు ఆయనలోని బేలతనాన్ని బయటపెట్టేస్తున్నాయి. ఆయన ఓడిపోతారనే కంగారు ఆయనలో బాగా కనిపిస్తోంది.

ఇదీ జగనంటే!

దాంతో ఆయన జగన్ మీద వ్యక్తిగత దూషణలను తీవ్ర స్థాయిలో చేశారు. చిన్నాన్నను ఇంట్లో వాళ్ళే చంపించి నాటకాలు ఆడుతున్నారంటూ జగన్ మీద అభాండాలు వేశారు.

తాను ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, తన వంటి సుపరిపాలకుడు కావాలో, జగన్ లాంటి అరాచక శక్తి కావాలో తేల్చుకోవాలని బాబు పిలుపు ఇచ్చారు.

తనను వద్దు అనుకుంటే తాను ఓ దండం పెట్టేసి వూరుకుంటానంటూ, బాబు చేసిన హాట్ కామెంట్స్ తమ్ముళ్లకు కూడా షాక్ ఇచ్చేలా ఉన్నాయి.

నిజానికి బాబుకు రాజకీయాలంటే ప్రాణం.వాటిని ఆయన సులువుగా వదులుకోరని, ఇలా చెప్పడం ద్వారా జనాల్లో సింపతీ క్రియేట్ చేసుకోవడానికి ఆయన ట్రై చేస్తున్నారని అంటున్నారు. మరో వైపు సీన్ మొత్తం అర్ధమైపోయి బాబు ఇలా రంకెలు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.