‘VVR’ బయ్యర్లకు రామ్ చరణ్ ఊరట!

Charan Helps to VVR Distributorsసంక్రాంతికి విడుదలైన ‘వినయ విధేయ రామ’ అనుకున్న అంచనాలను అందుకోలేదని తెలిసిన విషయమే.సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చినా, కొంతలో కొంత ఈ సినిమా బాగా వసూలు చేసినట్టే చెప్పుకోవాలి.

రామ్ చరణ్ ఆస్తులు చూస్తే ఆశ్చర్యమే!

ఈ సినిమా కారణంగా బయ్యర్లు దాదాపు 30 కోట్ల రూపాయల వరకూ నష్టపోయినట్టు తెలుస్తుంది.ఏదేమైనా ఇంత నష్టం భరించడం తమ వల్ల కాదంటున్నారు బయ్యర్లు.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన పారితోషకంలో కొంత మొత్తం వెనుక్కు ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా నష్టాలనే మిగిల్చింది.

నైజాం, ఆంధ్రా, ఓవర్సీస్ ఇలా అన్నిచోట్లా బయ్యర్లు పీకల్లోతు నష్టాల్లో మునిగారు. అందుకే వారిని ఆదుకోవాలని చరణ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం ఎంత అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఆపై నిర్మాత దానయ్యతో కలసి ఆయన నష్టాలు పంచుకోవాలని భావిస్తున్నాడు.కాగా మొత్తం 15 కోట్ల రూపాయల వరకూ వెనక్కు ఇవ్వనున్నారని సమాచారం.ఇలా బయ్యర్లను ఆదుకోవటం గొప్ప విషయమేనని సినీ విశ్లేషకులు అభినందిస్తున్నారు.

Advertisement