సైరా కోసం నయన్ ని రిక్వెస్ట్ చేసిన చెర్రీ

మెగా స్టార్ చిరంజీవి నయనతార కలిసి జంటగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న’సైరా నరసింహా రెడ్డి’ చిత్రంలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

అడవి దొంగగా ఎన్టీఆర్…?

 సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ లో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
కాగా ఎప్పటినుండో లేడీ సూపర్ స్టార్ నయన తార సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఇక తెలుగు సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలను అస్సలు పట్టించుకోదు.అయితే తాజాగా ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొనాలని నయన్ ను రిక్వెస్ట్ చేశాడట రామ్ చరణ్.

మొదట నయన్ అందుకు ఒప్పుకోలేదట కానీ చరణ్ రిక్వెస్ట్ చేసే సరికి సానుకూలంగా స్పందించిందనట్లు తెలుస్తుంది. చరణ్ కోరికను మన్నించి నయనతార సైరా ప్రమోషన్స్ కు వస్తుందో లేదో చూడాలి మరి.

Advertisement