చికెన్ చీజ్ బాల్స్

“చికెన్ చీజ్ బాల్స్” స్నాక్ ఐటెం లా చాలా బాగుంటుంది.
ఈ రెసిపీ ని మన ఇంట్లోనే సులభమైన పద్ధతి లో ఎలా తాయారు చేసుకోవాలో చూద్దాం.

ఓట్స్ పాయసం

Chicken Cheese Balls

కావలసిన పదార్థాలు:

చికెన్‌ బ్రెస్ట్‌- 250 గ్రాములు,
బంగాళాదుంప తురుము- 1 కప్పు, (ఉడికించిన )
కొత్తిమీర- 1 కప్పు,
చీజ్‌ తురుము- 200 గ్రాములు,
అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు,
పసుపు- 1/2 టీ స్పూను,
గుడ్లు- 2 ,
మైదా- 1టీ స్పూను,
బ్రెడ్‌ పొడి- 6 టీ స్పూన్లు,
బేకింగ్‌ సోడ- 1 టీ స్పూను,
కారం- 1 టీ స్పూను,
ఉప్పు- రుచికి సరిపడా,
నూనె- వేగించడానికి సరిపడా.

తయారీ విధానం:

చికెన్‌లో బోన్స్‌ లేకుండా చూసుకుని, మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని ఒక గిన్నె లోకి తీసుకొని అందులో బంగాళాదుంప తురుము, చీజ్‌ తురుము, అల్లం వెల్లుల్లి ముద్ద,
మైదా,గుడ్లు, బేకింగ్‌ సోడ ,రుచికి సరిపడా ఉప్పు, పసుపు ,కారం, అన్ని పదార్థాలూ వేసి, చేతితో బాగా కలిపి, చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండలను బ్రెడ్‌పొడిలో దొర్లించి, నూనె లో వేగించుకోవాలి.
ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని టమాటో సాస్ తో తింటే చికెన్ చీజ్ బాల్స్ చాలా రుచిగా ఉంటాయి.