రైతుల పట్ల చింతమనేని తీరు!

Chintamaneni About Farmersఈరోజు వట్లూరు జన్మభూమి మీటింగ్‌ కు చింతమనేని ప్రభాకర్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు, తమకు అందవలసిన నష్టపరిహారం ఇప్పించాలంటూ, ప్లకార్డ్స్‌ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

రౌడీయిజం చూపించుకున్న టీడీపీ ఎమెల్యే

దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై పరుష పదజాలాలతో దూషించడం మొదలుపెట్టాడు.సహనం కోల్పోయిన అన్నదాతలు సమస్యను పరిష్కరించకుండా, తమను తిట్టడం సరికాదంటూ వాదనకు దిగారు.

దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి ఆ బాధిత రైతులపై, ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు.

ఫిర్యాదు మేరకు పోలీసులు రైతుల మీద 353 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు కొఠారు రామచంద్ర రావు, కార్యకర్తలు పోలీస్‌ స్టేషన్‌ కెళ్లి రైతులను పరామర్శించారు.

Advertisement