వైసీపీ జెండా ఇంటిపై కట్టినందుకే..

Denduluru TDP MLAరోజు రోజుకి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.నిన్నటికి నిన్న రైతులపై కేసులు పెట్టించాడు.ఈ రోజు మరో దారుణానికి ఒడిగట్టాడు.

రౌడీయిజం చూపించుకున్న టీడీపీ ఎమెల్యే

అసలు విషయం ఏమిటంటే,పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడు గూడెం గ్రామానికి చెందిన పిట్టా విజయ్‌కుమార్, పిట్టా స్టీఫెన్‌కు తాతల కాలం నుంచి సంక్రమించిన స్థలంలో ఇల్లు కట్టుకున్నారు.

వారు వైఎస్సార్‌ సీపీపై ఉన్న అభిమానంతో ఇంటిపై వైసీపీ జెండా కట్టారు.దీంతో చింతమనేని ఆ వ్యక్తిపై కక్ష సాధింపునకు దిగాడు.

ఇప్పుడు వారు ఉంటున్న ఇంటి స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపించి, ఆ వ్యక్తి ఇంటి స్థలంలో నుంచి రోడ్డు వేయించే పనికి పూనుకున్నాడు.అడ్డుపడిన ఆ ఇంటి యజమానురాలిని పోలీసులు దౌర్జన్యంగా తోసివేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఇది తెలుసుకున్న వైసీపీ నేతలు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.అనంతరం వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.

 

Advertisement