చీరాల టీడీపీ టికెట్ ఎవరికి ?

ప్రస్తుతం టీడీపీ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడి పోవడంతో అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది.తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి వైసీపీ లో చేరేందుకు సిద్ధం కావడంతో టీడీపీ పరువు చీరాలలో నిలుపుకొనేందుకు అప్రమత్తమైంది.

ఒంగోలు పార్లిమెంట్ నుంచి షర్మిల పొట్టి …?

చీరాల టీడీపీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు ఎమ్మెల్సీ కరణం కుటుంబానికి అప్పగించేందుకు సిద్ధ్దమైనట్లు తెలుస్తుంది.వచ్చే ఎన్నికలలో చీరాల టీడీపీ అభ్యర్థిగాకరణం బలరామకృష్ణమూర్తి లేదా ఆయన తనయుడు కరణం వెంకటేశ్‌లలో ఎవరో ఒకరిని నిలపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం.

మరో వైపు చీరాల టికెట్‌ కోసం మాజీ మంత్రి పాలేటి రామారావు డిమాండ్‌ చేయగా అటు ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం రాబోయే ఎన్నికలలో తానే పోటీలో ఉంటానని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

చీరాల నుంచి ఇద్దరు నేతలు టికెట్‌ కోసం అధిష్టానం పై ఒత్తిడి తెస్తుండగా జిల్లా ముఖ్య నేతలు కరణం కుటుంబానికే టికెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం.