చిత్రలహరి .. రివ్యూలన్నీ పర్లేదంటున్నాయే!

సాయి ధరమ్ తేజ్ కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. అతని గత 6 చిత్రాలు పరాజయం పొందినా అంత తక్కువ గా చూడగలిగే నటుడైతే కాదు . సత్తా ఉంది ., ఆ కాస్త అదృష్టం రావట్లేదు అనే కేటగిరీ లో ఉన్నాడు . ఇక ఈ వారం లో విడుదలయిన చిత్రలహరి ప్రమోషన్స్ తో పర్లేదనిపించింది. సాయి కి ఆ కాస్త హిట్ వచ్చేస్తుందేమో లే పాపం అని చాలామంది అనుకున్నారు.

ఈ సెంటిమెంట్ మహర్షికి కలిసి వస్తుందా?

కానీ శుక్రవారం అయిపోయేసరికి వచ్చిన రివ్యూస్ అంత ఆశాజనకం గా లేవు. ముఖ్యమైన తెలుగు వెబ్ సైట్స్ ,మూవీ విమర్శకులు ఆ సినిమాకి “పర్లేదు ” అనే ముద్ర వేశారు . దర్శకుడు కిశోరె తిరుమల పాత్రలని ,సంభాషణల్ని రాసుకున్నంత బాగా కథ ని రాయలేదని వారు అభిప్రాయపడ్డారు.

chitralahari review

ఎప్పుడైతో ప్రేక్షకులు పాత్రల్లోని ,కథని ఎమోషన్ తో కనెక్ట్ అవలేదో ఆ సినిమాలు ఆడే పరిస్థితి లేదు. చిత్రలహరి కూడా అలా సగం సగం వండి వార్చిన వంటకం లనే ఉందని ఎక్కువమంది అభిప్రాయం. మరి విమర్శలని దాటుకొని ప్రేక్షకులని అలరించే విషయాలు ఏమైనా ఉంటే కానీ చిత్రలహరి కొన్ని వారాలు థియేటర్స్ లో ఉండే అవకాశం లేదు.