మహేష్ ను చూసి షాకైన సితార

మహేష్ బాబు ని చూసి సితార షాక్ ఎందుకు అయిందని అనుకుంటున్నారా ?.. షాక్ అయ్యింది మహేష్ బాబుని చూసి కాదండి మహేష్ మైనపు బొమ్మ చూసి .

ఓ యాడ్ కోసం అరుదైన లొకేషన్లలో మహేష్

మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.కాగా ఈ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మహేశ్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సితార పాప గురించి చెప్పారు.’నాలా ఉండే ఓ విగ్రహాన్ని సితార ఊహించలేదు.

దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. విగ్రహం దగ్గరికి వెళ్లి టచ్‌ చేసింది. అప్పుడు ఒకే.. ఇది విగ్రహం అనుకుంది. చాలా సేపు సాకింగ్ గా నిలబడిపోయింది’ అని చెప్పారు. ఒక్కరోజు ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన సింగపూర్‌ మేడం టుసాడ్స్‌ సిబ్బంది తిరిగి విగ్రహాన్ని తీసుకెళ్లారు.