జగన్ సత్తా ఏంటో., కాంగ్రెస్ కి ఇప్పుడు తెలిసిందట!

Congress Leaders about YCPరానున్న ఏపీ ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు కోడై కూస్తున్నాయి.అటువంటి జగన్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో కలవాలట.ఈ ప్రతిపాదన ఎంత హాస్యాస్పదంగా ఉందో కదా!.

రాటుతేలిన జగన్ రాజకీయం.. యుద్దానికి సిద్ధమా?

తాజాగా విశాఖకు చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్, వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలంటూ ప్రతిపాదించారు.ఎందుచేతనంటే రేపటి రోజున రాహుల్ గాంధి ప్రధాని అవుతారట.

ఆయన ప్రత్యేక హోదా ఇస్తారట. అందువల్ల హోదా కోసం చిత్తశుద్ధి ఉంటే వైసీపీని తీసుకొచ్చేసి కలిపేయండంటూ కాంగ్రెస్ కి ఆయన ఉచిత సలహా ఇస్తున్నారట.

వైసీపీ కూడా కాంగ్రెస్ లో భాగమేనన్నది ఆయన గారి వాదన. ఆ పార్టీలో ఉన్న వారంతా కూడా కాంగ్రెస్ నాయకులేనని, అక్కడ అంతా కాంగ్రెస్ భావజాలమే ఉందని కూడా అంటున్నారు.

నిజానికి ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు జగన్ పై అక్రమంగా కేసులు పెట్టి,ఆయన కుటుంబాన్ని ఎంతో బాధకు గురి చేశారు,అప్పుడు గుర్తుకు రాని జగన్ ఇప్పుడు గుర్తొచ్చారా అని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

ఇక వైసీపీ అధినేత జగన్ విషయానికి వస్తే,ఆయన తాజాగా తాము ఎవరితో పొత్తు పెట్టుకోమని,రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టేశారు.

Advertisement