కాపు రిజర్వేషన్స్ పై బాబుకి చిత్తశుద్ధి లేదు

సరిగ్గా ఎన్నిక‌లకు నాలుగు నెల‌ల ముందే అగ్ర‌వ‌ర్ణాల‌పై అభిమానం ప్ర‌ద‌ర్శించ‌డం కేవ‌లం ఓటు బ్యాంకు రాజ‌కీయం అనేది ముమ్మాటికీ నిజం.

రైతన్నల కోసం వరాలిస్తున్న వైసీపీ అధినేత

ఒక‌వేళ నిజంగానే ప్రజల పై మొదట్నుంచీ చిత్త‌శుద్ధి ఉంటే, గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఎప్పుడైనా ఈ అగ్ర‌వ‌ర్ణాల పేద‌లు మోడీ స‌ర్కారుకు ఎందుకు గుర్తుకురాన‌ట్టు?

ఈ విష‌యాన్ని వ‌దిలేసి కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఏపీ స‌ర్కారు చిత్త‌శుద్ధిని ప్ర‌శ్నించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు.

ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ,కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి ఏమాత్రం చిత్త‌శుద్ధి లేద‌ని విమ‌ర్శించారు.

నిజంగానే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల‌నుకుంటే హ‌ర్యానా, మ‌హారాష్ట్రల మాదిరిగా చ‌ట్టం చేయాల్సి ఉంద‌న్నారు. ఆయా రాష్ట్రాలు రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి చ‌ట్టం చేశాయ‌న్నారు.

కానీ, చంద్ర‌బాబు నాయుడు అలాంటి ప్ర‌య‌త్న‌మేదీ చెయ్య‌కుండానే నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు.

ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చిన బిల్లు వ‌ల్ల బ్రాహ్మ‌ణ‌, క‌మ్మ‌, రెడ్డి వ‌ర్గాల‌తోపాటు కాపుల‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఈ బిల్లుపై కూడా పార్ల‌మెంటులో టీడీపీ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింద‌నీ, అగ్ర‌కులాల పేద‌ల‌కు మేలు చేయ‌డం ఆ పార్టీకి ఇష్టం లేద‌ని విమ‌ర్శించారు.

జీవీఎల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే,ఆంధ్రా నుంచే కాకా తెలంగాణ నుంచి, మ‌హారాష్ట్ర నుంచి కూడా ఇలాంటి రిజ‌ర్వేష‌న్లకు సంబంధించిన కొన్ని రాష్ట్రాలు చేసిన తీర్మానాలు కేంద్రం ద‌గ్గ‌ర పెండింగ్ ఉన్నాయి.

Advertisement