వైసీపీలోకి ఆమంచి..దగ్గుబాటి స్కెచ్!

Daggubati Sketchesఇటీవలే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరారు.తాజాగా ఆమంచి కూడా టీడీపీని వీడి వైసీపీలోకి చేరనున్నారని వార్తలు జోరుగా కొనసాగుతున్నాయి.

కడపలో టీడీపీకి గుండు సున్నా..

 

నిజానికి దగ్గుబాటితో ఆమంచి కృష్ణమోహన్ కు ఎప్పటినుండో వ్యాపార లావాదేవీలున్నాయి.దీంతో దగ్గుబాటి వైసీపీలో చేరిన తర్వాత ఆమంచికి ఆ పార్టీలో రాచబాట పరిచినట్లయింది.దగ్గుబాటితో ఆయనకున్న సాన్నిహిత్యం అలాంటిది.

రానున్న ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గం నుంచి ఈసారి దగ్గుబాటి తనయుడు హితేశ్ చెంచురాం వైసీపీ తరపున బరిలోకి దిగుతున్నారు.ఈ నియోజకవర్గంలో కాపుల ఓట్లు అధికంగా ఉండటంతో, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి తోడుంటే ఆ సీట్లో విజయం సాధించవచ్చనేది దగ్గుబాటి ప్లాన్.

అందుకే ఆమంచిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు దగ్గుబాటి స్కెచ్ వేశారు.చూడాలి మరి ఆమంచి రాకను జగన్ స్వాగతిస్తారో లేదో.

Advertisement