డైసీ ఎడ్గర్ జోన్స్ ఎవరో తెలుసా?

Daisy Edgar Jones Detailsతెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్. వీరిద్దరి కాంబినేషన్ లో ‘#RRR’ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.

#RRR పై వచ్చిన వార్త నిజమే !

ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌ చరణ్ నటిస్తుండగా , నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు.

‘#RRR’ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గర్ జోన్స్ కనిపించనుందని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.ఈ అమ్మాయి వివరాలు తెలియక ఎన్టీఆర్ అభిమానులు అయోమయంలో ఉన్నారట.

ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే డైసీ బ్రిటిష్ సుందరి,సుప్రసిద్ధ నేషనల్ యూత్ థియేటర్ లో నటిగా శిక్షణ తీసుకుంది.ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మొదలుకుని టీనేజ్ యాక్టర్ దాకా ఎదగడానికి చాలా కష్టపడిందట.

ఆమె కష్టమే ఇప్పుడు ‘#RRR’ లో నటించే అవకాశం దక్కించింది.ఇక ఈ సినిమాలో ఆమె పాత్ర ఇలా ఉంటుందట.భారతీయ విప్లవ వీరుడిని ప్రేమించిన ఇంగ్లీష్ సుందరిగా ఆమె పాత్రను జక్కన్న ప్రత్యేకంగా డిజైన్ చేయించారట.

Advertisement