వైసీపీ బీసీ గర్జనకు డేట్ ఫిక్స్

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ బీసీ నేతలతో సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు.

జనసేన అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు…

వైఎస్సార్‌ సీపీ కీలక నేతలు జంగా కృష్ణమూర్తి, బొత్స సత్యనారాయణ, జోగు రమేష్‌, పార్థసారథి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మేపిదేవి వెంకటరమణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికలో ప్రజల్లో ముందుకు వెళ్లే దిశగా చర్చించినట్లు సమాచారం.ఈ నేపధ్యంలో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి 19 వ తేదీన బీసీ గర్జన పేరుతో బీసీల సమావేశానికి వైసీపీ అధినేత పిలుపునిచ్చారు.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే సమర శంఖారావం పేరుతో ఫిబ్రవరి 4,5,6 తేదీలలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.