నాలుగు భాషల్లో విడుదల కాబోతున్న ‘డియర్ కామ్రేడ్’!

Dear Comrade in 4 languagesయూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ దేవరకొండ, ‘గీతాగోవిందం’ సినిమాతో మరో ట్రెండ్ సృష్టించాడు. ఏకంగా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు.

విజయ్ కి ఆమె పెద్ద అభిమానట!

మరోసారి విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక కథానాయికగా భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో జోడీ కడుతున్నారు.

అయితే ఈ సినిమాలో విజయ్ మెడికల్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడట.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా,మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరిగిపోతున్నాయట.

తెలుస్తున్న సమాచారం ప్రకారం మైత్రీ మూవీ మేకర్స్ వారు,ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ భాషల్లో మే 22న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారట.

Advertisement