ప్రజలు వైసీపీ వైపే వున్నారు :వైఎస్‌ జగన్‌

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ,కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తామని స్పష్టం చేశారు.

23 స్థానాలలో వైసీపీ :టైమ్స్ నౌ

లోటస్‌పాండ్‌లో ని తన నివాసం లో తటస్థ పార్టీల తో చర్చించిన అయన వారితో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విధివిధానాల గురించి వివరించారు. 25 ఎంపీ స్థానాలను ప్రజలు వైఎస్సార్‌ సీపీకే కట్టబెడతారని.. తద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని .

ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్‌ వస్తేనే మంచిదని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు.
దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఉందని.. చట్టప్రకారం విశాఖకు రైల్వే జోన్‌ రావాలన్నారు.

రైల్వేజోన్‌ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని అలాగే రైల్వేజోన్‌ తో పాటు కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం కూడా తమ పార్టీ కృషి చేస్తోందని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement