కార్తీ చిత్రానికి బడ్జెట్ 60 కోట్లట !

రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’.తెలుగులో ‘ఊపిరి’చిత్రం తరువాత మంచి సక్సెస్ లేని కార్తీ ఈ చిత్రం పై భారీ ఆశలే పెట్టుకున్నాడు.ఇప్పటికే విడుదలైన దేవ్ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి.

చైతు కి అత్త దొరికేసినట్లే

 రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.తాజాగా ఈ చిత్ర బడ్జెట్ అందర్నీ ఆశ్చర్యంలో పడేస్తుంది.ఏకంగా ఈ సినిమాకు రూ. 60 కోట్ల బడ్జెట్ పెట్టారని సమాచారం. సూర్య నటించిన `సింగం 2` చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలుస్తుంది.

రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement