‘దేవ్’ టీజర్:అర్థం కాని చదువు,ఇష్టం లేని ఉద్యోగం!

కార్తీ,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్’,ఈ మధ్య  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఖాకీ విజయంతో కార్తీ,రకుల్ రెండవ సారి జతగట్టి నటిస్తున్నారు.ఈ సినిమా నుండి తాజాగా టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ లో రకుల్ ముందుకంటే ఎంతో అందంగా కనిపిస్తుంది.అలాగే కార్తీ లుక్,డైలాగ్స్ ట్రెండీగా ఉన్నాయి.ఇందులో లవ్,ఎమోషన్,చేజింగ్స్ అన్ని సమపాళ్లలో కనిపిస్తున్నాయి.ఈ సినిమా అటు యూత్ ని,ఫ్యామిలీస్ ని తప్పకుండా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలలో రమ్య కృష్ణ,ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నారు.త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై అటు కోలీవుడ్ లో,ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.

సమంత ఆశలన్నీ ‘సూపర్ డీలక్స్’ పైనే !

Advertisement