దేవ్ ట్రైలర్ : అడ్వెంచరస్ అబ్బాయి యొక్క ప్రేమ కథ

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తమిళ దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వం లో వస్తున్న తాజా చిత్రం ‘దేవ్’. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం.

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ‘సీతారామరాజు’

‘అసలు మగతోడే అవసరం లేదనుకునే సెల్ఫిష్ అమ్మాయి..అడ్వెంచర్స్ ఇష్టపడే వ్యక్తి ప్రేమలో పడటం’ వంటి విబిన్నమైన కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు దర్శకుడు. ప్రస్తుతం ‘దేవ్’ ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

లవ్, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్స్ తో ఆకట్టుకోనున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యక్రిష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.ఇక ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ చాలా ఎమోషనల్ గా అనిపించాయి.

ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రేమికులు రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

‘శరీరాన్ని దృవపరచాలంటే ఎన్నోదారులు ఉన్నాయి.. మనసుని దృవపరచాలంటే ఒంటిరి తనం వల్లే అవుతుంది’ అంటూ దేవ్ తన ప్రేమ కథను వినిపిస్తున్నాడు.మరి ట్రైలర్ ఎలా ఉందొ సరదాగా మీరు ఓ లుక్కేయండి.