తెలుగుదేశం పార్టీ అంతమే తన ధ్యేయం:డీఎల్‌

DL Ravindra Reddy Comments On TDPఏపీలో తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు.సోమవారం ఆయన వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

వైసీపీ బీసీ గర్జనకు డేట్ ఫిక్స్

ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో భవిష్యత్‌ కార్యచరణపై కార్యకర్తలతో చర్చించారు. విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయ పాలన కొనసాగిస్తోందని విమర్శించారు.

గతంలో వైఎస్సార్ జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలుపొందిన డీఎల్‌ డీఎల్‌ రవీంద్రారెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు.ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డీఎల్‌…టీడీపీపై విమర్శలు చేయడంతో ఆయన మరో పార్టీలో చేరతారా,లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.