వైసీపీలో చేరనున్న డీఎల్‌ రవీంద్రారెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు.తాజాగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున పెద్దగా ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీని వీడనున్నారట.

పిడుగురాళ్ల నుంచి వైఎస్‌ జగన్‌ తొలి ప్రచార సభ

త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి బుధవారం ఉదయం ఖాజీపేటలో డీఎల్‌ రవీంద్రారెడ్డిని కలిశారు.

అనంతరం డీఎల్‌ మీడియాతో మాట్లాడుతూ..వైఎస్‌ జగన్ నాకు ఫోన్‌ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా సంవత్సరాలుగా వైఎస్‌ ఆర్‌ కుటుంబసభ్యుడిని. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటా. పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ గెలుపు కోసం కృషి చేస్తా. వైఎస్‌ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్‌ కోరారు’ అని తెలిపారు.