వివేకానందరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం

Ds Cpi Narayana Express Condolences For YS Vivekanandaదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, జగన్‌మోహన రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆయనతో మంచి సాంగిత్యం వున్న పలువురు సంతాపం తెలిపారు.

వైసీపీ వైపు ఆకర్షితులవుతున్న ప్రజాప్రతినిధులు, తటస్థులు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ, వివేకానందరెడ్డి మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి మృతి బాధాకరమని, ఆయనతో కలిసి తాము పని చేశామని గుర్తు చేసుకున్నారు.
ఆయన చాలా సౌమ్యుడని వివాదాలకి చాలా దూరమని, ఆయన కుటుంబ సభ్యులకు సీపీఐ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా అని నారాయణ పేర్కొన్నారు.

అలాగే టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్‌ మాట్లాడుతూ,వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి నాకు ఎంతో బాధ కలిగించిందని, ఆయన కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందని, ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని, వివేకానందరెడ్డి మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ… ఈ ఆపద సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాని ఆకాంక్షించారు.

Advertisement