జగన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా?

Dwakra Women Supports YS Jaganఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నాయకులకు.ప్రతి నిమిషం చాలా విలువైనదనే చెప్పాలి.ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు మరోసారి వరాలు కురిపిస్తున్నాడు.

వంగవీటి రాధ వ్యాఖ్యలపై స్పందించిన జగన్!

తాజాగా డ్వాక్రా మహిళల ఓట్ల కోసం పదివేల రూపాయల నగదు, స్మార్ట్ ఫోన్ ఇస్తామంటున్నారు.ఈ ప్రకటనతో మహిళల ఓట్లన్నీ చంద్రబాబు ఖాతాలో పడటం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

ఎందుకంటే చంద్రబాబు ఇస్తున్న పది వేలు నగదు కాదు. పోస్ట్ డేటెడ్ చెక్కులట. అవి కూడా మూడు విడతలుగా ఇస్తారట.ఇప్పటికే డ్వాక్రా రుణాల మాఫీల విషయం చంద్రబాబు మహిళలను మోసగించారన్న అపవాదు ఉంది.

ఇప్పుడు కూడా చంద్రబాబు మహిళలను చెక్కుల పేరుతో మోసగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో మహిళలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అదే ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ అధికారంలోకి వస్తే ఏకంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించాడు. అదీ ఏక మొత్తంలో చేస్తామన్నాడు. కాబట్టి మహిళలు చంద్రబాబు, జగన్ పథకాలను ఒక్కసారి పరిశీలిస్తే ఎక్కువగా జగన్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.