తమిళం లోకి అవకాశాల్లేని మరో తెలుగందం!

ఈషా రెబ్బా , అచ్చ తెలుగు తెలంగాణ అందం !! అరకొర సినిమాలు వచ్చినా , అవి పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలో లేక సాధారణం గా ఆడిన చిన్న సినిమాలో అయ్యాయి . అంతే కానీ ఈషా అందానికి అభినయానికి తగ్గ సక్సెస్ మాత్రం కాలేకపోయాయి . అందని ద్రాక్ష లా మారిన ఆ పెద్ద విజయం అలా ఊరిస్తూనే ఉంది ఈ అమ్మడిని.

అరవ సినిమాలతో దండ యాత్ర చేస్తున్న కీర్తి !

అలా అవకాశాల్లేక తమిళ్ దారి పట్టే చాలా మంది హీరోయిన్స్ లాగానే ఈషా కూడా తమిళ్ లో జీవీ ప్రకాష్ హీరో గా రూపొందుతున్న ఒక సినిమా లో హీరోయిన్ గా ఒక అవకాశాన్ని పొందింది . ఎగిల్ దర్శకత్వం లోఈ సినిమా రూపొందనుంది.

eesha rebba tamil movie

ఇంతకూ ముందు ఇలా తెలుగు నుంచి తమిళ్ కి షిఫ్ట్ అయిన తెలుగు అమ్మాయిల్లో అంజలి ,శ్రీ దివ్య ,స్వాతి ,బిందు మాధవి ఉన్నారు . వీరు అక్కడ మంచి నటీమణులుగా పేరు కూడా పొందారు . మరి గ్లామర్ కూడా ఒలికించగల ఈషా అక్కడ పాగా వేస్తుందేమో చూడాలి.