ఎగ్ సమోసాలు

గుడ్లుతో కూడా రుచికరంగా సమోసాలు చేసుకోవచ్చు.ఇవి సాయంకాలం స్నాక్స్ లా చాలా బాగుంటాయి .
వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.ఎగ్ సమోసాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా…

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

Egg Samosa

కావాల్సిన పదార్థాలు;

మైదా పిండి – 2 కప్పులు,
గోధుమ పిండి – 1 కప్పు,
ఉడకబెట్టిన గుడ్లు – 4,
మిరియాల పొడి – 1 టీ స్పూను,
ఉప్పు -రుచికి సరిపడా,
నూనె – తగినంత.

తయారుచేసే విధానం;

ఉడికించిన గుడ్లను తీసుకొని, చిన్న చిన్న ముక్కలుగా తురమాలి.
అందులో కాస్త మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి .
ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, గోధుమ పిండి కొద్దిగా నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు, పోసుకొని ముద్దలా కలుపుకొని , ఆ పిండి ముద్దను తడిబట్టలో పెట్టి అరగంటసేపు పక్కన పెట్టాలి.
తరువాత పిండిని చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. ఆ ఉండల్ని చపాతీలా వత్తి, పెనం మీద రెండు వైపులా కాల్చి పెట్టుకోవాలి.
తరువాత ఒక్కో చపాతీని సగానికి కోయ్యాలి . ఆ చపాతీ ముక్కల్ని తడిబట్టలో ఒక నిమిషం పాటు ఉంచి తీసేయ్యాలి .
ఒక్కొక్క ముక్కని త్రికోణాకారంలో సమోసాలా చుట్టి అందులో గుడ్డు మిశ్రమాన్ని పెట్టి మడిచేయ్యాలి . వాటిని కాగిన నూనెలో వేయించి తీసి ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి.
చాలా రుచికరంగా ఉండే ఎగ్ సమోసాలు సిద్ధమైనట్టే.

Advertisement