ఎగ్ లెస్ కేక్

గుడ్డు అంటే ఇష్టపడని పడని వారు ఉంటారు… కొంతమంది పూర్తి వెజిటేరియన్స్ ఉంటారు… అలాంటి వారి కోసం ఇంట్లోనే ఎగ్ లెస్ కేక్ ఎలా చేయాలో చూద్దాం…

ఎగ్ సమోసాలు

Eggless Cake

 

కావాల్సిన పదార్థాలు;

మైదాపిండి – 2 కప్పులు,
పంచదార పొడి – 1 1/2 కప్పు,
బేకింగ్ పౌడర్ – 2 1/2 టీ స్పూన్లు,
పెరుగు – 3/4 కప్పు,
నీళ్లు – 1/2 కప్పు,
వెన్న – 1/2 కప్పు,
వెనీలా ఎసెన్స్ -1 టీ స్పూను,
ఉప్పు – 1/4 టీ స్పూను

తయారుచేయు విధానం;

ఒక గిన్నె తీసుకుని (కుక్కర్లో పట్టేది) అడుగు తడి లేకుండా చూసుకొని నెయ్యి లేదా వెన్న పూసి కాస్త మైదాపిండి చల్లాలి.
మరో గిన్నె తీసుకుని అందులో మైదా, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
అందులోనే పంచదార పొడి, వెన్న, వెనీలా ఎసెన్సు, మరియు నీళ్లు కూడా పోసి బాగా కలుపుకోవాలి.
గరిటెతో కన్నా గిలక్కొడితే మంచిది .తరువాత కాస్త ఉప్పు మరియు పెరుగు కూడా వేసి బాగా గిలక్కొట్టాలి.
ఆ మిశ్రమాన్నిమొత్తం ముందుగా వెన్న రాసి పెట్టుకున్న గిన్నెలో పోసి కుక్కర్లో పెట్టి మూత పెట్టాలి.
కుక్కర్లో నీళ్లు పోయకూడదు. అలాగే కుక్కర్ మూతకి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు.
ముందు ఒక రెండు నిమిషాలు పెద్దమంట మీద ఉంచి… తరువాత చిన్న మంట మీద అరగంట సేపు ఉడికించాలి.
అంతే చాలా రుచిగా ఉండే ఎగ్ లెస్ కేసు సిద్ధమైనట్టే.