టీడీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నుండి అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారు.అవనిగడ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్‌ మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా

వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాధ్యాహ్నం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.2014 ఎన్నికల్లో తనను కాదని మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్‌ ఇచ్చిన చంద్రబాబు.. ‘నీ బాధ్యత నేను తీసుకుంటా. తగిన ప్రాధాన్యం ఇస్తానని చెప్పి మోసం చేశాడు.

తమకు గుర్తింపునివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే టీడీపీని వీడుతున్నట్టు తెలిపారు.వైఎస్‌ జగన్‌ అవనిగడ్డకు వస్తున్న నేపథ్యంలో ఆయన సమక్షంలో పార్టీలో చేరడం శుభపరిణామంగా భావిస్తున్నాను’ అని శ్రీహరి అన్నారు.