ఫలించిన సత్యం టీం కృషి “రాయల్ వశిష్ట ” వెలికితీత

experts pull out royal vasista boat from godavari
experts pull out royal vasista boat from godavari

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద సెప్టెంబర్ 15న గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు చివరికి బయటకొచ్చింది. సత్యం టీమ్ మరికొంచెంసేపటి లో బోటును గోదావరి ఒడ్డుకు తీసుకురానున్నారు. మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో ఉంది. మంగళవారం డైవర్ల సాయంతో మరోసారి నీటి అడుగుభాగం నుంచి రోప్‌లు కట్టి వెలికితీసే ప్రయత్నం చేశారు. పలుసార్లు వర్షం అంతరాయం కలిగించినా ప్రయత్నాలు ఆపకుండా, జేసీబీ సాయంతో ఆ రోప్‌లను బయటకు లాగారు.. చివరగా నీళ్లపైకి బోటు వచ్చింది. బోటులో రెండు డెడ్‌బాడీలను గుర్తించారు.బాలాజీ మెరైన్స్‌ సంస్థకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ ఎప్పటికి రెండుసార్లు బోటు వెలికితీసే ప్రయత్నాలు చేసింది. బోటు మునిగిన కొద్ది రోజులకు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. వరద ఉధృతి పెరగడంతో వెలికితీత పనులు నిలిపివేశారు. గత వారంలో రెండసోరి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ రెండు, మూడు రోజుల పాటూ ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కాకినాడా పోర్ట్ నుంచి కెప్టెన్ ఆదినారాయణను పిలిపించారు. అలాగే స్కూబా టీమ్ కూడా రంగంలోకి దిగింది.మూడో ప్రయత్నం లో బోటు ను బయటకి తీయగలిగారు.
సెప్టెంబర్ 15న రాయల్ వశిష్టబోటు కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 39 మంది చనిపోగా..26 మంది సురక్షితంగా బయట పడ్డారు , మరికొందరి ఆచూకీ దొరకలేదు.