100 కోట్ల క్లబ్ లో సంక్రాంతి అల్లుళ్లు

F2 Movie 100 Crores Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎఫ్ 2 చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది.

నాగ్ – చైతు కాంబో లో బంగార్రాజు

సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సంక్రాంతి అల్లుళ్లు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల పై చిలుకు షేర్ ను రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 13 రోజుల్లోనే 68 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

మల్టీ స్టారర్ చిత్రాల్లో 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది.అలాగే ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచి మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

గత ఏడాది వరుస ప్లాప్స్ తో నష్టాలను చవిచూసిన దిల్ రాజుకు ఎఫ్ 2 భారీ లాభాలను తీసుకొచ్చింది.

అనిల్ ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ అనే సినిమా ను తెరకెక్కించనున్నాడు.ఈ సీక్వెల్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ తోపాటు మరో స్టార్ హీరో కూడా జాయిన్ కానున్నాడని తెలుస్తుంది.