ఎఫ్ 2 రివ్యూ : ఈ అల్లుళ్ళు అంతగా అలరించలేదు!

F2 Movie Review

ఎఫ్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ :2.5/5.0

విడుదల తేదీ : జనవరి 12, 2019

నటీనటులు : వెంకటేష్ ,తమన్నా ,వరుణ్ తేజ్ ,మెహ్రీన్

దర్శకత్వం : అనిల్ రావిపూడి

నిర్మాత: దిల్ రాజు

సంగీతం : దేవీశ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి

ఎడిటర్ : బిక్కిన తమ్మిరాజు

వినయ విధేయ రామ మూవీ రివ్యూ:బోయపాటి ముంత మసాలా!

టీజర్ ,ట్రైలర్ తో ఆకట్టుకున్న “ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ” ..అదేనండి .. ఎఫ్ 2 సినిమా ఈ రోజు థియేటర్ల లోకి వచ్చింది . సీనియర్ హీరో వెంకటేష్ ,తమన్నా ,వరుణ్ తేజ్ మరియు మెహ్రీన్ ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ సినిమా మంచి ఆసక్తి ని కలుగచేసింది . మరి ఈ సంక్రాంతి పండక్కి అందరికంటే చివరిగా వచ్చిన ఈ అల్లుళ్ళు ఎలా మెప్పించారో చూద్దాం పదండి .

కథ :

యూరోప్ లో వెంకీ ,వరుణ్ పరిగెడుతూ పోలీసులకు దొరుకుతారు . నాజర్ ఇంటరాగేషన్ లో వీరిద్దరూ తమ కథ ను చెప్తారు . అందులో వెంకీ తన భార్య హారిక (తమన్నా ) గురించి ,ఆమె ఇంటి వాళ్ళ నుంచి తనకి ఎదురైనా ఇబ్బందుల గురించి చెప్తాడు . తోడల్లుడయిన వరుణ్ కూడా హనీ (మెహ్రీన్ ) తో పెళ్లి తర్వాత జరిగిన పరిణామాలు చెప్తాడు .

వారి కథేంటి ? యూరోప్ ఎందుకు వెళ్లారు ? తమ భార్య ల తో ఉన్న సమస్యలు తీర్చుకోగలిగారా అన్నది మిగతా కధాంశం .

విశ్లేషణ :

అమాయకులైన భర్తలు ,పొగరుబోతు భార్య లు .. కావాల్సినంత కామెడీ పుట్టించడానికి ఆస్కారమున్న సబ్జెక్టు . అనిల్ రావిపూడి కూడా దాని చుట్టూ కొన్ని సన్నివేశాలు చక్కగా అల్లుకున్నాడు . కానీ , కథ ను అంతకు మించి విస్తరించలేదు . అక్కడక్కడే కథ తిరుగుతూ , బలవంతం గా రాసిన కామెడీ తో ద్వితీయార్థం వచ్చేసరికి చూసే ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది .

ఈవీవీ సినిమాల్లో ఉండే కామెడీ బాగా కనిపించింది . ప్రథమార్ధం లో వెంకీ కామెడీ టైమింగ్ తో సినిమాను నడిపిస్తే , తమన్నా పర్లేదనిపించింది . వరుణ్ తెలంగాణ బస్తి పిల్లాడిలా ఒక్కోసారి మెప్పించినా , మెహ్రీన్ మాత్రం ఆమె అతి తో విసిగించింది .

ఆంధ్ర భాష లో వెంకీ ఒదిగిపోతే ,తెలంగాణ భాష లో వరుణ్ తేజ్ పట్టి పట్టి డైలాగ్స్ చెప్పాడు . ఇలా అన్ని కలగా పులగంలా ఉన్నాయి .కథ ,లాజిక్ అనేవి ఈ సినిమాలో చూడటం దండగ .

ఇక రెండో సగం లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నటులు వచ్చిపోతుంటారు . వెన్నెల కిషోర్ ,రాజేంద్ర ప్రసాద్ ,హరి తేజ ,ప్రియదర్శి ,బిగ్ బాస్ నూతన్ నాయుడు ,ప్రకాష్ రాజ్ ఇలా లెక్కలేనంత మంది తో స్క్రీన్ నిండిపోయింది . కానీ వారు పండించిన హాస్యం తక్కువే .

దేవి సంగీతం లో “రెచ్చిపోదాం బ్రదర్ ” ఒక్కటే బావుంది. యాంకర్ అనసూయ కూడా ఒక పాత లో మెరిసింది. సమీర్ ఫోటోగ్రఫీ లో ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది . దిల్ రాజు నిర్మాణ విలువలు పర్లేదు. విజయాల బాటలో ఉన్న అనిల్ రావిపూడి ఈ సారి మాత్రం తడబడ్డాడు . రెండో సగం మొత్తం చాల పేలవమైన కామెడీ తో నింపేశాడు.

ఒక్క మాట లో చెప్పాలంటే ., టైం పాస్ మూవీ ! కథా ,కాకర కాయ లేకున్నా పర్లేదు, కొంచెం కామెడీ చాలనుకుంటే ఎఫ్ 2 మరీ డిసప్పాయింట్ చేయదు.